News April 24, 2025
ఉగ్రదాడి.. కేంద్రంపై షర్మిల తీవ్ర విమర్శలు

AP: ఉగ్రదాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ చౌకీదార్ ప్రభుత్వం సొంత ప్రజలపై లాఠీ ఝులిపిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటంలో బిజీగా ఉండి సరిహద్దుల్లో రక్షణ కల్పించడంలో ఫెయిలైందని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీజీ. ఇదిగో మీ లాఠీ. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించే వారిపై కాకుండా మన శత్రువులపై ఉపయోగించండి’ అని లాఠీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
Similar News
News April 25, 2025
రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.
News April 25, 2025
ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.