News April 24, 2025
90 శాతం సమస్యలు ఎమ్మార్వో వద్దనే పరిష్కారమవుతాయి: జనగామ కలెక్టర్

భూ భారతి చట్టంతో 90 శాతం వరకు సమస్యలు తహశీల్దార్ల వద్దనే పరిష్కారమవుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం ఉన్న దృశ్యా ఈ చట్టంపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News January 5, 2026
మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 5, 2026
అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో నిన్న టీడీపీలో చేరారు. ముందుగా వేలాది మంది అనుచరులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియాజ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వైసీపీ జెండా మోసినా తనకు గుర్తింపు దక్కలేదన్నారు.
News January 5, 2026
జీ.మాడుగుల: విలువైన గంధం చెట్లు నరికివేత

జీ.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన సిరి గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసి, అపహరించుకు పోయారు. ఉర్లమెట్టకు ఆనుకొని ఉన్న కొండపై విలువైన గంధం చెట్లను కొట్టుకుని పోయారు. ఇది స్మగ్లర్ల పనేనని స్థానికులు భావిస్తున్నారు. ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదివారం కోరారు.


