News April 24, 2025
అఖిలపక్ష భేటీకి అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందింది. అమిత్ షా తనకు కాల్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించినట్లు ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు వినేందుకు PM ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. ఇవాళ ఉదయం అఖిలపక్ష భేటీకి 5-10 MPలు ఉన్న చిన్న పార్టీలనూ పిలవాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.
News April 25, 2025
ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం
News April 25, 2025
‘పహల్గామ్’ మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ

AP: పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్, చంద్రమౌళి కుటుంబాలను మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.