News April 24, 2025

VKB: పురుగుమందు తాగిన కాంగ్రెస్ నాయకుడు

image

బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అధికార పార్టీలోని కొందరి వల్ల మనస్తాపం చెందిన ఓ నాయకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువారం జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో మైలవర్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి వేదికపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో పురుగుమందు తాగాడు. వైద్యం కోసం VKB ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 25, 2025

MNCL: విలేకరుల ముసుగులో దందా.. ఇద్దరి అరెస్ట్

image

విలేకరుల ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న నిందితులను జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. CI సమ్మయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం జాతీయ రహదారి వద్ద ప్రెస్‌స్టిక్కర్ అంటించిన టాటా ఇండికా కారును తనిఖీ చేశారు. కారులో 216 కిలోల బెల్లం, 30 కిలోల పటిక పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని రాజ్ కుమార్, సంజులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు చందు పరారీలోఉన్నాడు.

News April 25, 2025

ASF: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

News April 25, 2025

రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

image

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.

error: Content is protected !!