News April 24, 2025

యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా?

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే మనకు వ్యతిరేకంగా పాక్ నిలువగలదా? మన సైన్యం సంఖ్య 1.44 మిలియన్. 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, అధునాతన క్రూయిజ్ క్షిపణులు, భీమ్ ట్యాంకులు, సబ్‌మెరైన్లు ఉన్నాయి. కానీ పాక్ వద్ద ఇవేమీ చెప్పుకోదగ్గ సంఖ్యలో కూడా లేవు. యుద్ధం వస్తే మన ముందు పాకిస్థాన్ ఎంతోకాలం నిలవదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News

News January 13, 2026

భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

image

భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే భోగిగా భావిస్తారు. అదే రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం శుభంగా చెబుతున్నారు. దీంతోనే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తర్వాతి రోజు సంక్రాంతి కాగా జనవరి 16న కనుమ పండుగ ఉంటుంది.

News January 13, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (<>NIO<<>>) 14 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా (సివిల్, EE, CE/IT), డిగ్రీ(సైన్స్/ఏదైనా) అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనవరి 22న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డిప్లొమా విద్యార్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు కాగా, డిగ్రీ విద్యార్థులకు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in

News January 13, 2026

ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలుంటే డేంజర్

image

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా, గడ్డలు గడ్డలుగా కావడం, భరించలేని కడుపు/పొత్తి కడుపు నొప్పి, వికారం, అలసట, చలి, జ్వరం.. వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు. తద్వారా దాని ప్రభావం ఇటు మీపై, అటు కడుపులోని బిడ్డపై పడకుండా ముందే జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.