News March 28, 2024

IPL: ఒకే ఓవర్‌లో 4,4,6,4,6,1

image

ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 185/5 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR 36 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్‌లో పరాగ్ ఏకంగా 25(4,4,6,4,6,1) రన్స్ రాబట్టారు. అశ్విన్ 29, జురెల్ 20 రన్స్ చేశారు.

Similar News

News November 3, 2025

₹1500 MO కేసు… 32 ఏళ్ల తర్వాత రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్‌కి 3ఏళ్ల జైలు

image

మనీ ఆర్డర్ మోసం కేసులో నోయిడా కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. అరుణ్ 1993లో ₹1500 తండ్రికి MO చేశారు. సబ్‌పోస్టుమాస్టర్ మహేంద్ర కుమార్ కమీషన్‌‌తో కలిపి ₹1575కు నకిలీ రశీదు ఇచ్చి డబ్బును ప్రభుత్వానికి జమ చేయలేదు. సొమ్ము అందకపోవడంతో అరుణ్ ఫిర్యాదు చేయగా అధికారులు కేసుపెట్టారు. తప్పు అంగీకరించిన కుమార్ సొమ్మును తిరిగిచ్చేశాడు. విచారణ అనంతరం కోర్టు రిటైరైన అతడికి 3 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా విధించింది.

News November 3, 2025

పరమాత్ముడి గుణాలను మనం వర్ణించగలమా?

image

పరమాత్ముడి గుణాలు అనంతం. వాటిని లెక్కించడం అసాధ్యం. ఆయన మనపై కరుణతోనే ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో రామావతారం ఒకటి. ఆ మర్యాద పురుషోత్తముడి గుణాలను ఆదిశేషుడు, మహర్షులు కూడా పూర్తిగా వర్ణించలేరు. అయినా భక్తులు శాస్త్రాలలో ఆయన మహిమలను కీర్తించి, పాటించి, ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. మనం కూడా ఆ దైవ గుణాలను తెలుసుకొని, పాటించాలి. ఆయన లీలలు విని, అనుసరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల వాక్కు.

News November 3, 2025

కట్నం వద్దు కానీ.. 10 కండీషన్స్! చదివేయండి

image

తనకు కట్నం వద్దు కానీ వధువు 10 కండీషన్స్‌కు ఓకే చెప్పాలని ఓ యువకుడు SMలో పోస్ట్ చేశాడు. 1.No PreWed షూట్, 2.లెహంగా బదులు చీర ధరించాలి, 3.సంప్రదాయ సంగీతం ఉండాలి. 4.దండలు ప్రశాంతంగా మార్చుకోవాలి. 5.పూజారి తంతును ఎవరూ ఆపరాదు. 6.ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ జోక్యం ఉండొద్దు. 7. అభ్యంతరకర పోజులు అడగొద్దు. 8.వేదికపై నో కిస్సెస్/హగ్స్. 9.పెళ్లి పగలే జరగాలి. 10.సాయంత్రానికి అప్పగింతలు పూర్తి చేయాలి.