News April 24, 2025

విజయవాడ: విడదల గోపీ అరెస్ట్‌పై అప్డేట్

image

మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీకి విజయవాడ జీజీహెచ్‌లో కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ నిర్వాహకులను బెదిరించిన ఘటనపై నమోదైన కేసులో గురువారం ఉదయం ACB అధికారులు హైదరాబాద్‌లో గోపిని అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ తీసుకొచ్చిన అధికారులు వైద్యపరీక్షల తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. 

Similar News

News December 27, 2025

RUB సాధ్యపడదు: MP పెమ్మసాని

image

గుంటూరు శంకర్ విలాస్‌లో ROB మాత్రమే నిర్మిస్తున్నామని RUB సాధ్యపడదని MP పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేస్తున్నామని చెప్పారు. ముందుగా అనుకున్నట్లే DDR బాండ్లు, ROB నిర్మాణానికి ఖర్చు మొత్తం రూ.150 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. కొందరు కోరుకుంటున్నట్లు ఆర్యూబీ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

News December 27, 2025

భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కు చెల్లించుకున్న 5,282 మంది భక్తులు

image

వేములవాడ భీమేశ్వరాలయంలో శుక్రవారం నాడు 5,282 మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, 4,045 మంది శీఘ్ర దర్శనం, 1,244 మంది అతి శీఘ్ర దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. మొత్తం మీద శుక్రవారం నాడు సుమారు 80,000 మంది భక్తులు భీమన్నను దర్శించుకున్నారు.

News December 27, 2025

కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటి గడ్డగా నల్లగొండ జిల్లా

image

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం సీపీఐ జిల్లాలో దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి, గిట్టుబాటు ధరలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన పార్టీ నిర్మాణంతో ప్రజల మధ్య పని చేస్తూ సమ సమాజ సాధనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోంది.