News April 24, 2025
జగిత్యాల: సమస్యకు పరిష్కారం ఆలోచించాలి: ఎస్పీ

సమస్యకు పరిష్కారం ఆలోచించాలి తప్పా, మానసిక వేదనకు గురి కాకూడదని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి గురువారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, అధికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య ఉంటే ఆయన తెలియజేయాలన్నారు. వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో పోలీస్ శాఖ ఒకటన్నారు.
Similar News
News January 17, 2026
మేడారంలో తేలనున్న తేదీలు!

రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలోని 116 పురపాలక సంఘాలకు, 7 నగర పాలక సంస్థల ఎన్నికల తేదీలను మేడారంలో జరిగే క్యాబినెట్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈనెల 18న సాయంత్రం మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే మేడారంలోని హరిత హోటల్లో సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 18న సాయంత్రం మేడారానికి చేరుకొని క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
News January 17, 2026
BREAKING: నంద్యాలలో తల్లి, ఇద్దరు పిల్లల మృతి

నంద్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం లలితా నగర్‌లో తల్లి మల్లిక(26), పిల్లలు ఇషాంత్(3), పరిణితి(9 నెలలు) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కొనఊపిరితో ఉన్న ముగ్గురినీ కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోలుకోలేక మృతి చెందారు. భర్త ఉదయ్ కిరణ్, ఆడపడుచులే తల్లి, పిల్లలను చంపారంటూ ఆమె కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు.
News January 17, 2026
పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.


