News April 24, 2025

IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.

Similar News

News April 25, 2025

సిక్కింలో వరదలు.. చిక్కుకున్న 1000మంది టూరిస్టులు

image

సిక్కింను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదార్లు మూసుకుపోయి 1000మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియల కారణంగా మున్షితాంగ్, లాచుంగ్ చుంగ్‌తాంగ్ రోడ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.

News April 25, 2025

IPL: RR ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

image

రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్‌లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్‌లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్‌రన్ రేటు ఉండాలి. GT, DC, RCB, MI, PBKS అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RR ప్లేఆఫ్స్ వెళ్లలేదు.

News April 25, 2025

ఈ వారంలోనే TG టెన్త్ ఫలితాలు!

image

TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

error: Content is protected !!