News April 24, 2025
చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
న్యుమోనియా లక్షణాలు ఇవే: DMHO

నేటి నుంచి ఫిబ్రవరి 28వరకు అన్ని ఆరోగ్య కేంద్రాలలో సాన్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు DMHO జగదీశ్వరరావు తెలిపారు. ఈ సాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లలలో న్యుమోనియా లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రతలు, వైద్యం గూర్చి నిర్వహించనున్నారు. దగ్గు, జలుబు ఎక్కువ రావటం, అధిక జ్వరం, శ్వాస తీసుకొనే సమయంలో డొక్కలు ఎగురవేయటం లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News November 12, 2025
ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన వివరాలు

ఈనెల 14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.30 ఎయిర్ పోర్టు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో కలసి ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 8.55కు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15కు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 12, 2025
విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.


