News April 24, 2025
టీ20ల్లో సరికొత్త రికార్డు

టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(62) సరికొత్త రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేయడంతో బాబర్(61)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో గేల్(57), వార్నర్(55), బట్లర్(52), డుప్లెసిస్(52) ఉన్నారు.
Similar News
News April 25, 2025
గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.
News April 25, 2025
HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

AP: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉ.8కి మొదలవనుంది. మీర్జా రియాజ్(MIM), గౌతంరావు(BJP) పోటీలో ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 112 మందికి గాను 88 మంది ఓటు వేశారు. 45 ఓట్లు వచ్చినవారు విజేతగా నిలుస్తారు. MIMకు సింగిల్‌గానే 50 ఓట్లు ఉండటం, INC(14) కూడా మద్దతివ్వడంతో రియాజ్ గెలుపు లాంఛనమే. ఉ.10 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. BRS సభ్యులు(24) ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
News April 25, 2025
143 మంది యాక్టర్లతో వాట్సాప్ గ్రూప్.. కానీ: నాని

బన్నీ, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి సహా 143 మంది తెలుగు యాక్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉందని హీరో నాని తెలిపారు. అయితే అది ప్రస్తుతం యాక్టివ్‌గా లేదని, తాను కూడా ఆ గ్రూప్‌ను మ్యూట్‌లో ఉంచుతానని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించుకోవడానికి దాన్ని క్రియేట్ చేశామన్నారు. అప్పట్లో బాగా చాట్ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానుంది.