News April 24, 2025
ఎన్టీఆర్: లిక్కర్ కేసులో చాణక్యకు 14 రోజుల రిమాండ్

లిక్కర్ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న చాణక్యకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. లిక్కర్ ముడుపుల కేసులో చాణక్య పాత్రను విచారించిన సిట్ అధికారులు ఈ కుంభకోణంలో వచ్చిన డబ్బును పలువురికి చేరవేయడంలో అతడు కీలక పాత్ర పోషినట్లు గుర్తించారు. దీంతో చాణక్యను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
Similar News
News April 25, 2025
మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News April 25, 2025
సిద్దిపేట: మహిళ ప్రాణం తీసిన పిడుగు

పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన బెజ్జంకిలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎడ్ల బండి చౌరస్తా సమీపంలోని ఓ చింత చెట్టు సమీప ప్రాంతంలో పిడుగు పడగా దగ్గర ఉన్న టేకు రంగవ్వ (68) మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శంకరయ్య, కుమారులు, కూతుర్లు ఉన్నారు. అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు టేకు హరీశ్ స్పృహ తప్పి పడిపోగా చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.
News April 25, 2025
జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్‌కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.