News April 24, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ 590 ప్లస్ మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు కలెక్టర్ అభినందన➤ మాడుగుల మోదకొండమ్మను దర్శించుకున్న జాయింట్ కలెక్టర్➤ ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ➤ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి:DRO➤ విశాల్ మార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని CITU ధర్నా➤ వడ్డాదిలో అగ్నిప్రమాదం➤ పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం➤ ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు

Similar News

News April 25, 2025

HYD: 2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

image

HYD స్థానిక సంస్థల MLC సీటు MIM కైవసం చేసుకుంది. అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ జులై 26 1977లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో నూర్ బజార్, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేల కోటా MLCగా శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా 40 ఓట్లు కలిగిన MIM గెలుపు ఖాయమైనప్పటికీ, GHMCలో బలం పుంజుకుంటున్న బీజేపీ తమదే గెలుపనడంతో ఈ ఎన్నికపై కాస్త అసక్తి నెలకొంది.

News April 25, 2025

సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. కొనరావుపేట 43.9°c, ఇల్లంతకుంట 43.8°c, వీర్నపల్లి 43.7 °c,ఎల్లారెడ్డిపేట 43.7 °c,సిరిసిల్ల 43.6 °c, వేములవాడ 43.5 °c,చందుర్తి 43.5°c, గంభీరావుపేట 43.5 °c,తంగళ్ళపల్లి 42.7°c, ముస్తాబాద్ 42.1°c, కోనరావుపేట 41.6°c, రుద్రంగి 41.6 °c,లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News April 25, 2025

సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెబుతా : మాజీ ఎంపీ హర్ష కుమార్

image

తనను పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని గంటలు నగరంలో తిప్పడంతో కోపం, బాధతో సీఎం చంద్రబాబును ఏకవచనంతో తూలనాడానని, ఇది తప్పేనని, అవసరమైతే ఆయనకు క్షమాపణ చెబుతానని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. ఈ మేరకు హర్ష ఒక వీడియో విడుదల చేసి పశ్చాతాప పడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి పిలుపివ్వడంతో తనను అరెస్టు చేయడం బాధ అనిపించినా, పోలీసులు తనను గౌరవంగా చూశారన్నారు.

error: Content is protected !!