News March 28, 2024
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తల్లి కాబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్, ప్రమోషన్లలో ఆమె వదులు దుస్తులు ధరించడంతో అలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై పరిణీతి స్పందించారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లా? నేను వేసుకునే డ్రెస్సును చూసి అలా భావిస్తారా?’ అని ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా గతేడాది ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి వివాహమాడిన సంగతి తెలిసిందే.
Similar News
News April 18, 2026
నటిపై పరువు నష్టం దావా వేసిన చాహల్

తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్ట్‌లు, మీడియా ముందు మాట్లాడినందుకు నటి తానియా <<19636894>>ఛటర్జీపై<<>> టీమిండియా క్రికెటర్ చాహల్ సీరియస్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై తానియా స్పందిస్తూ.. ‘ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. దీనివల్ల నేనే ట్రోలింగ్‌కు గురయ్యా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 18, 2026
బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.
News April 18, 2026
ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.


