News April 25, 2025
BREAKING: RCB సూపర్ విక్టరీ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండు(చిన్నస్వామి)లో గెలుపు బోణీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను 194/9 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీశ్ 28, పరాగ్ 22, జురెల్ 47, హెట్మైర్ 11, శుభమ్ 12 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, కృనాల్ 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
Similar News
News April 25, 2025
భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు తప్ప మిగతావన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి.
News April 25, 2025
సింధు జలాల నిల్వ ఎలా?: ఒవైసీ

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
News April 25, 2025
సరిహద్దుల్లో హైటెన్షన్.. సైనికులకు సెలవులు రద్దు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుపై వెళ్లిన సైనికులను వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ ద్వివేది, సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. LoC వద్ద పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.