News April 25, 2025

కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్టం

image

ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్ట చేశారు. భక్తుల బ్యాగులను సిబ్బంది క్షుణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన భక్తుల గురించి వివరాలు ఆరా తీశారు. కాణిపాకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Similar News

News April 25, 2025

చిత్తూరు: రోడ్ల మరమ్మతుకు నిధుల మంజూరు

image

రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.

News April 25, 2025

చిత్తూరు: DPOకు ఉత్తమ ప్రతిభా పురస్కారం

image

పన్నుల వసూళ్లలో గతేడాది చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన పన్నులు, పన్నేతర వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24 కోట్లకు రూ.22 కోట్లు వసూలు చేసి 88%తో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా DPO సుధాకర్ రావు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. 

News April 25, 2025

సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.

error: Content is protected !!