News April 25, 2025
26న కామారెడ్డిలో జాబ్ మేళా

ఈ నెల 26న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు.
Similar News
News April 25, 2025
NGKL: చివరి దశకు చేరుకున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి కోసం 62 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి, బురద తొలగింపు దాదాపు పూర్తి అయినప్పటికీ డేంజర్ జోన్ సమీపంలో మాత్రం సహాయక చర్యలు ప్రారంభించలేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.
News April 25, 2025
కొమురం భీం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కేరామేరి మండలంలో 45.0 నమోదు కాగా ఆసిఫాబాద్ 44.9 తీర్యానీ, రెబ్బెన, పెంచికల్పేట్ 44.8, కాగజ్నగర్ 44.5, సిర్పూర్ టి 44.4, దహేగాం, వాంకిడి 43.9, బెజ్జూరు 43.3, కౌటాల 43.1, జైనూర్ 42.6, చింతలమానపల్లి 42.4, సిర్పూర్ యు, లింగాపూర్ 41.9 గా నమోదయ్యాయి.
News April 25, 2025
ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు: SI

పిచ్చాటూరు మండలంలో ఓ యువకుడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశులు తెలిపారు. SSBపేటకు చెందిన నిందితుడు పార్థిబన్(25) ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.