News April 25, 2025
అమరచింత: విషపూరితమైన ద్రవం తాగి చిన్నారి మృతి

అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రిలకు ఆర్థిక (18నెలలు), మణికంఠలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి ఆర్థిక మృతి చెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.
News January 12, 2026
సంగారెడ్డి: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.


