News April 25, 2025

రావికమతం: జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైన బాల సరస్వతి

image

రావికమతం మం. కేబీపీ అగ్రహారానికి చెందిన దివ్యాంగురాలు నక్కరాజు బాల సరస్వతి జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైందని ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు గురువారం తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, స్పెషల్ ఒలంపిక్ భారత క్రీడా సంస్థ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీల్లో బాల సరస్వతి ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. దీంతో చత్తీస్‌గడ్‌లో నిర్వహించనున్న పోటీలకు ఆమెను ఎంపిక చేశారని వెల్లడించారు.

Similar News

News April 25, 2025

సింధు జలాల నిల్వ ఎలా?: ఒవైసీ

image

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.

News April 25, 2025

అనకాపల్లి జిల్లాకు 3,904 పింఛన్ల మంజూరుకు అనుమతి

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద స్పౌజ్ క్యాటగిరిలో అనకాపల్లి జిల్లాకు 3,908 వితంతు పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు శుక్రవారం తెలిపారు. 2023 డిసెంబర్1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్లు తీసుకుంటూ మృతి చెందిన వారి భార్యలకు పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. ఈ మేరకు మంజూరుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.

News April 25, 2025

మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

error: Content is protected !!