News April 25, 2025
ములుగు: రజతోత్సవ సభ వేదిక సిద్ధం

ఈనెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభకు సభా ప్రాంగణం సిద్ధమైంది. సభా ప్రాంగణంలో భారీ వేదికను సిద్ధం చేశారు. మహిళలు పురుషులకు వేర్వేరుగా సభా ప్రాంగణంలో కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ సభకు భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది.
Similar News
News April 16, 2026
సీబీఎస్‌ఈ ఫలితాల్లో తాళ్ల పద్మావతి స్కూల్ సత్తా

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో తాళ్ల పద్మావతి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులు అఫియా(485), నిత్య(473), కార్తిక(472), నిగ్నేశిత(469) అత్యుత్తమ మార్కులతో రాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు డా.వంశీ, చైతన్య, డా.వరుణ్, వైష్ణవి అభినందించారు.
News April 16, 2026
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.45 గంటలకు ఆర్ధిక శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం 04.00 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్షిస్తారు. తిరిగి 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
News April 16, 2026
వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్‌పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.


