News April 25, 2025
ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News April 25, 2025
సింధు జలాల నిల్వ ఎలా?: ఒవైసీ

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
News April 25, 2025
అనకాపల్లి జిల్లాకు 3,904 పింఛన్ల మంజూరుకు అనుమతి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద స్పౌజ్ క్యాటగిరిలో అనకాపల్లి జిల్లాకు 3,908 వితంతు పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు శుక్రవారం తెలిపారు. 2023 డిసెంబర్1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్లు తీసుకుంటూ మృతి చెందిన వారి భార్యలకు పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. ఈ మేరకు మంజూరుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.