News April 25, 2025
MDM: ‘1973 మందికి కారుణ్య నియామకాలు’

మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ డిపెండెంట్ ఒకరికి జీఎం దేవేందర్ కారుణ్య నియామకపత్రం అందజేశారు. మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు 1973 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు జీఎం పేర్కొన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు, సమయాలు భిన్నంగా ఉంటాయన్నారు. విధులకు గైర్హాజరయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 25, 2025
NGKL: చివరి దశకు చేరుకున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి కోసం 62 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి, బురద తొలగింపు దాదాపు పూర్తి అయినప్పటికీ డేంజర్ జోన్ సమీపంలో మాత్రం సహాయక చర్యలు ప్రారంభించలేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.
News April 25, 2025
కొమురం భీం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కేరామేరి మండలంలో 45.0 నమోదు కాగా ఆసిఫాబాద్ 44.9 తీర్యానీ, రెబ్బెన, పెంచికల్పేట్ 44.8, కాగజ్నగర్ 44.5, సిర్పూర్ టి 44.4, దహేగాం, వాంకిడి 43.9, బెజ్జూరు 43.3, కౌటాల 43.1, జైనూర్ 42.6, చింతలమానపల్లి 42.4, సిర్పూర్ యు, లింగాపూర్ 41.9 గా నమోదయ్యాయి.
News April 25, 2025
ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు: SI

పిచ్చాటూరు మండలంలో ఓ యువకుడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశులు తెలిపారు. SSBపేటకు చెందిన నిందితుడు పార్థిబన్(25) ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.