News April 25, 2025
NRML: భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని భర్త సూసైడ్

కుభీర్ మండలం అంతర్నీ గ్రామానికి చెందిన సురేశ్(32) మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం చేసుకొని ఇల్లరికం ఉంటున్నాడు. ఈనెల 22న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య వాళ్ల అక్క ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సురేశ్ మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 25, 2025
వనపర్తి జిల్లా కోర్ట్ సీఏఓకు వీడ్కోలు

వనపర్తి జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ HYD మెట్రోపాలిటన్‌కు బదిలీ సందర్భంగా పలువురు ముఖ్యులు శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. సీఏఓగా అందరి మన్ననలు పొందారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. సామాజిక కార్యకర్త పోచ రవీందర్ రెడ్డి, న్యా. ఉ. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి, బ్రహ్మయ్య చారి, రామ్ రెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News April 25, 2025
తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
News April 25, 2025
నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.