News April 25, 2025
మరిపెడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని పూల బజార్‌కు చెందిన వంశీ(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కాలువ ఒడ్డు ప్రాంతంలో బైక్, ఆటో ఢీ కొనడంతో వంశీ మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం మరిపెడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Similar News
News April 25, 2025
భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు తప్ప మిగతావన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి.
News April 25, 2025
సింధు జలాల నిల్వ ఎలా?: ఒవైసీ

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
News April 25, 2025
అనకాపల్లి జిల్లాకు 3,904 పింఛన్ల మంజూరుకు అనుమతి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద స్పౌజ్ క్యాటగిరిలో అనకాపల్లి జిల్లాకు 3,908 వితంతు పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు శుక్రవారం తెలిపారు. 2023 డిసెంబర్1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్లు తీసుకుంటూ మృతి చెందిన వారి భార్యలకు పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. ఈ మేరకు మంజూరుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.