News April 25, 2025
షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News April 25, 2025
సింధు జలాల నిల్వ ఎలా?: ఒవైసీ

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
News April 25, 2025
అనకాపల్లి జిల్లాకు 3,904 పింఛన్ల మంజూరుకు అనుమతి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద స్పౌజ్ క్యాటగిరిలో అనకాపల్లి జిల్లాకు 3,908 వితంతు పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు శుక్రవారం తెలిపారు. 2023 డిసెంబర్1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్లు తీసుకుంటూ మృతి చెందిన వారి భార్యలకు పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. ఈ మేరకు మంజూరుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.