News April 25, 2025
KMR: ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ MLAకు బెదిరింపులు

జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావును బ్లాక్ మెయిల్ చేసిన ఓ రిపోర్టర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. MLAకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతానని ఓ మహిళతో కలిసి శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు MLA ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు.
Similar News
News April 25, 2025
ఏలూరు: ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్స్ ఫ్రీ

ఏలూరు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం అడ్మిషన్స్ ఉచితంగా కల్పిస్తున్నామని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) అధికారి పంకజ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 లోగా (cse.ap.gov.in) వెబ్ సైట్‌లో అర్హులైన అభ్యర్థులు 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.
News April 25, 2025
కల్వకుర్తి: పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కృష్ణారెడ్డి ఎన్నిక

కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రాష్ట్ర సమావేశాల్లో కృష్ణారెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఎన్నుకున్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
News April 25, 2025
హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.