News March 28, 2024
కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: జగన్
AP: మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని, జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమని సీఎం జగన్ అన్నారు. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఏసుప్రభు త్యాగాన్ని కీర్తించారు. ‘మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’ అని జగన్ తెలిపారు.
Similar News
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!
కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.