News April 25, 2025
HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.
Similar News
News April 17, 2026
స్వీయ గణనతో తొలిదశ డేటా: కలెక్టర్

ప్రతి ఒక్కరూ డిజిటల్ జనగణన తొలి దశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణనలో ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సెన్సస్-2027కు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సెన్సస్–2027కు సంబంధించిన తొలిదశపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
News April 17, 2026
ADB: అడవి బిడ్డలకు తప్పని ‘బాట’ కష్టాలు!

ఉమ్మడి జిల్లాలోని 224 ఆవాసాలకు నేటికీ రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ASFలోని 86, ADB 69, MNCL 42, NRMLలోని 27 గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో వాగులు పొంగితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. మంగి, గుండాల వంటి ప్రాంతాలకు కనీసం నడిచే దారి కూడా లేదు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా తమ బతుకుల్లో వెలుగు నింపే నాథుడే లేడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 17, 2026
లోక్‌సభ నియోజకవర్గంగా అమరావతి!

AP: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో LS స్థానాలు 38కి చేరుతాయి. దీంతో ప్రస్తుత 25 సీట్లతో పాటు మరో 13 ఏర్పాటవుతాయి. నియోజకవర్గాల పరిధులూ మారుతాయి. రాజధానిగా చట్టబద్ధ హోదా దక్కిన అమరావతి కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉంది. గతంలోని తెనాలి, బొబ్బిలి, గుడివాడ, మార్కాపురం వంటి సీట్లు తిరిగి ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది. 2011 జణగణన ప్రకారం చేస్తే ఒక్కో స్థానం పరిధిలో 13L జనాభా ఉంటారు.


