News April 25, 2025
సదుం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌పై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సదుం ఇన్‌ఛార్జ్ MRO మారూఫ్ హుస్సేన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు వీఆర్వో మహబూబ్ బాషాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త MROను నియమించే వరకు ప్రస్తుతం డీటీగా ఉన్న కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.
News April 19, 2026
చిత్తూరు: ఇనామ్ భూములకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు

ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. చిత్తూరులో 358.91, తిరుపతిలో 1950.34 అన్నమయ్య జిల్లాలో 3929.95 ఎకరాల చొప్పున ఇనామ్ భూములు ఉన్నాయి. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.


