News April 25, 2025

భారత్, పాక్ సంయమనం పాటించాలి: UN

image

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.

Similar News

News April 19, 2026

బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

image

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.

News April 19, 2026

విపక్షాలపై మోదీ ‘భ్రూణ హత్య’ అస్త్రం!

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని మోదీ ‘భ్రూణ హత్య’తో పోల్చడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ విమర్శల కంటే ఇలాంటి భావోద్వేగ పదాలు వాడటం వల్ల మహిళా ఓటర్లలోకి సందేశం బలంగా వెళ్తుందని BJP భావన. విపక్షాలు బిల్లును అడ్డుకోవడం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని పురిట్లోనే చంపేయడమేనని మోదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పదం రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

News April 19, 2026

2027లో అల్లు అర్జున్ ‘రాకా’?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో ఈ సినిమా 2027లో రాదనే వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్‌లో నిజం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా బన్నీ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారట. భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పటికీ 2027 సెకండాఫ్‌లోనే మూవీని రిలీజ్ చేసేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని టాక్.