News April 25, 2025

అల్లూరి: కవల పిల్లలకు ఒకేలా మార్కులు

image

ముంచింగిపుట్టు మండలం మాకవరం గ్రామానికి చెందిన రామ్, లక్ష్మణ్ కవల పిల్లలు. వాళ్లిద్దరూ కలిసి పుట్టారు. కలిసి పెరిగారు. కలిసే చదివారు. ఇద్దరిదీ ఒకే రూపం, ఒకే బడి, ఒకే తరగతి, చివరికి వారికి వచ్చిన మార్కులూ కూడా ఒక్కటే. ముంచింగిపుట్టు GTWAస్కూల్ (B-1)లో 10వ తరగతి చదివి, ఇటీవల విడుదలైన ఫలితాలలో సమాన మార్కులు(349)తో పాస్ అయ్యి ఆశ్చర్య పరిచారు. ఇది కాకతాళీయమే అయినా, పేరెంట్స్, టీచర్స్ సంతోషంగా ఉందన్నారు.

Similar News

News January 7, 2026

నల్లగొండ: దొంగతనాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర

image

జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆయన ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు రాత్రి గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. నేరాలు వదిలేసిన వారికి అండగా ఉంటామని తెలిపారు.

News January 7, 2026

పోలవరం: సీఎం చంద్రబాబు పర్యటనలో కీ పాయింట్స్

image

▶వైసీపీ ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం ఆలస్యం
▶టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తి చేశాం
▶26 R&R కాలనీల నిర్మాణం పూర్తి
▶పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తాం
▶వైసీపీ పోలవరాన్ని గోదావరిలో ముంచేసింది
▶నదులను అనుసంధానం చేయడమే నా లక్ష్యం
▶పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేశాం
▶పోలవరంపై రాజకీయాలు చేయవద్దు

News January 7, 2026

తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితం తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,38,270కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500 పతనమై రూ.1,26,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,77,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.