News April 25, 2025
అన్నమయ్య: పది పరీక్షలో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు మృతి

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.
Similar News
News July 9, 2025
కడప అభివృద్ధిపై జిల్లాస్థాయి సమావేశం

కడప కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. కడప మరింత వేగంగా అభివృద్ధి చెందేలా కార్యాచరణను సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి తదితరులు ఉన్నారు.
News July 8, 2025
కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.