News March 28, 2024
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డ్రగ్స్ వ్యాపారంలో కూరుకుపోయారు: గాదరి కిషోర్
NLG: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలను బొంద పెడతామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఈరోజు నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డ్రగ్స్ వ్యాపారంలో కూరుకుపోయారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపొద్దని యువతను కోరారు. ఢిల్లీలో గొంతుక వినబడాలంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
Similar News
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు
నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.