News April 25, 2025
సత్తెనపల్లి: పుట్టిన రోజే అనంతలోకాలకు

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో నిన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 16, 2026
చిత్తూరు: గొర్రెల మందపై చిరుత దాడి!

పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందగా మరొక గొర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్యంకు చెందిన కృష్ణయ్య తన 40 గొర్రెలను శుక్రవారం అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందిందని, మరొక గొర్రెకు గాయాలయ్యాయన్నారు. ఇంకో గొర్రె అదృశ్యమైనట్లు గుర్తించామని రైతు తెలిపారు.
News January 16, 2026
IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <
News January 16, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

*గద్వాల: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన
*మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులు ఆహ్వానం
*జిల్లాకు 5 మంది కొత్త ల్యాబ్ టెక్నీషియన్లు
*అయిజ: మున్సిపల్ ఎన్నికలకు 42 పోలింగ్ బూత్‌లు
*అలంపూర్: రేపు అమ్మవారి దర్శనం నిలిపివేత
*మానవపాడు: మెడిసిన్ స్టూడెంట్ మృతి పట్ల ప్రముఖుల నివాళి
*ఇటిక్యాల: వావిలాలలో వృషభాల బల ప్రదర్శన
*కేటి దొడ్డి: రోడ్డు భద్రత అందరి బాధ్యత- ఎస్సై శ్రీనివాసులు


