News April 25, 2025

GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.

Similar News

News July 5, 2025

తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

image

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News July 4, 2025

GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

image

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

News May 8, 2025

గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలివే.! 

image

గుంటూరు మిరప మార్కెట్‌కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.