News April 25, 2025
వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.
Similar News
News January 5, 2026
ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.
News January 5, 2026
ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.
News January 5, 2026
ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.


