News April 25, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

జిల్లాలో ఎండలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. గరిష్టంగా మద్నూర్ మండలంలో 44.6° నమోదవ్వగా బిచ్కుంద 44.5° దోమకొండ రామారెడ్డి 44.3° నస్రుల్లాబాద్ జుక్కల్ 44° సదాశివనగర్ గాంధారి పాల్వంచ లలో 43.9° పెద్దకొడప్గల్ 43.7° కామారెడ్డి 43.3° లింగంపేట్ నిజాంసాగర్ 43.2° తాడ్వాయి బీర్కూర్ 43° కనిష్టంగా పిట్లంలో 41.3° నమోదయ్యాయి. అధిక వేడి దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News January 17, 2026
పెద్దపల్లి జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

పెద్దపల్లి జిల్లాలోని పురపాలికలు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ ముగిసింది. రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్సీ (జనరల్)కు కేటాయించగా, పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్మన్ స్థానాలు బీసీ(జనరల్)కు దక్కాయి. సుల్తానాబాద్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించారు. మరికాసేపట్లో వార్డులవారీగా పూర్తిస్థాయి జాబితా వెలువడనుంది.
News January 17, 2026
H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.
News January 17, 2026
సంగారెడ్డిలో 19న ప్రజావాణి రద్దు

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి నిర్వహణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆమె వివరించారు.


