News April 25, 2025

కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News July 8, 2025

15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, దీనికి అవసరమైన పటిష్ఠ ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యా శాఖ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధిరలో జి+2 మోడల్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.

News July 8, 2025

‘ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించాలి’

image

పోర్చుగల్‌లో ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారిణి మాధవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 21-40 ఏళ్ళు కలిగిన గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి 2-5 సం.రాల అనుభవం ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్‌లను tomcom.resume@gమెయిల్.comకు మెయిల్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9440049937, 9440051452 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

News July 7, 2025

దరఖాస్తు సమర్పించిన రోజే.. సమస్య పరిష్కారం.!

image

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన తుపాకుల శైలజకు 2022లో YSR కాలనీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా, అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఇల్లు తీసుకోలేదు. దీంతో సోమవారం శైలజ ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు దరఖాస్తు అందించింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు శైలజ కృతజ్ఞతలు తెలిపింది.