News April 25, 2025
HYD: 2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

HYD స్థానిక సంస్థల MLC సీటు MIM కైవసం చేసుకుంది. అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ జులై 26 1977లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో నూర్ బజార్, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేల కోటా MLCగా శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా 40 ఓట్లు కలిగిన MIM గెలుపు ఖాయమైనప్పటికీ, GHMCలో బలం పుంజుకుంటున్న బీజేపీ తమదే గెలుపనడంతో ఈ ఎన్నికపై కాస్త అసక్తి నెలకొంది.
Similar News
News April 25, 2025
HYD: సెలవుల్లో జూపార్క్ చుట్టేద్దాం..!

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.
News April 25, 2025
స్కూల్ విద్యార్థులకు ఓయూలో ఇంగ్లిష్ క్లాసస్

8, 9,10 విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి. రోజూ ఉదయం 8.15 నుంచి 9.45 వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు 7989903001 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
News April 25, 2025
HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.