News April 25, 2025

HYD: విద్యార్థులూ.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

image

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. త్వరలో 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఎగ్జామ్‌లో పాసైన వారి సంగతి అటుంచితే ఫెయిల్ అయిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారికి భరోసా ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మానసిక వేదనకు గురవుతున్న వారు ఈ నంబర్లకు 7893078930, 04066202000, 9493238208, 9152987821, 14416 కాల్ చేయండి. వీరి సూచనలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News April 18, 2026

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.