News March 28, 2024
గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీ మృతి
ఉ.ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, పొలిటిషియన్ ముఖ్తర్ అన్సారీ(60) గుండెపోటుతో మృతి చెందారు. పొత్తి కడుపు నొప్పితో ఆయనను నిన్న బాండా మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్లీ గుండెపోటు వచ్చింది. అయితే జైలులో ఉన్న అన్సారీకి విషం ఎక్కించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్సారీ మృతి వార్త తెలియగానే ఘాజీపూర్‌లోని అతడి ఇంటి వద్దకు జనం తరలి వచ్చారు.
Similar News
News November 6, 2024
BIG BREAKING: అల్లు అర్జున్‌కు ఊరట
AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పిచ్చింది.
News November 6, 2024
పుంజుకున్న కమలా హారిస్.. తేడా 20 ఓట్లే
అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థితో పోలిస్తే కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 230, కమల 210తో నిలిచారు. ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమెను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వాషింగ్టన్ ఆదుకున్నాయి. నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమమైందని తెలుస్తోంది.
News November 6, 2024
T-HUB స్టార్టప్ కంపెనీ ఘనత.. KTR విషెస్
TG: హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటైన తెలంగాణకు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ 6.2మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధించడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. T-HUB 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు. మారుత్ డ్రోన్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.