News April 25, 2025
KNR: ప్రతి బుధవారం వరంగల్ మార్కెట్ బంద్!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ మార్కెట్‌కు మిర్చి పంటను అమ్మకానికి తీసుకెళ్లే రైతులకు ముఖ్య గమనిక. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గుమస్తా సంఘం కోరిక మేరకు ఈ నెల 30 నుంచి జూన్ 11 వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించినట్లు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మార్కెట్ బీట్ సమయం కూడా ఉదయం 07:05 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు గమనించగలరు.
Similar News
News January 14, 2026
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

WPL-2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్‌జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.
News January 14, 2026
సంగారెడ్డి: అంగన్‌వాడీలకు విద్యుదీకరణ, మరమ్మతులు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, మరమ్మతులపై కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలకు తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విద్యుత్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.


