News March 29, 2024
KKRలోకి 16 ఏళ్ల టీనేజర్

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. దీంతో అతడి స్థానాన్ని అఫ్గానిస్థాన్ యంగ్ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్‌ఫర్‌తో KKR భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే దక్కించుకుంది. మరోవైపు ప్రసిధ్ కృష్ణ స్థానంలో కేశవ మహరాజ్‌ను తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు తీసుకుంది.
Similar News
News November 11, 2025
జంక్ ఫుడ్ తింటున్నారా?

అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ (కూల్ డ్రింక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ మాంసం) కేవలం బరువు పెంచడమే కాకుండా మెదడుకు తీవ్ర హాని కలిగిస్తుందని హెల్సింకి యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే 30 వేల మంది బ్రెయిన్స్ స్కాన్ చేయగా సెల్స్ డ్యామేజ్ & వాపు వంటి మార్పులు కనిపించాయి. ఇవి మెదడును తిరిగి ప్రోగ్రామింగ్ చేసి, అదే చెత్త ఆహారాన్ని పదేపదే కోరుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
News November 11, 2025
దేశంలో మహిళలే అసలైన మైనారిటీలు: SC

పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై SC కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తాజా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు జయా ఠాకూర్ (CONG) దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌లు నాగరత్న, మహదేవన్‌ల బెంచి విచారించింది. ‘పౌరులందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మహిళలు 48% ఉన్నా రాజకీయ సమానత్వంపై చర్చ నడుస్తోంది. అసలైన మైనారిటీలు వారే’ అని వ్యాఖ్యానించింది.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


