News April 25, 2025
ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
Similar News
News May 7, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ADB SP

ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వారం రోజులలో జిల్లాలో 13 ఫిర్యాదులు నమోదయినట్లు తెలిపారు. ఆన్‌లైన్ మనీ, గేమింగ్, బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.
News May 7, 2025
ADB కలెక్టర్‌కు జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ అభినందన

కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అందుకున్నందుకు అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమెతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
News May 7, 2025
ఆదిలాబాద్ కలెక్టర్‌ను కలిసిన సాయి చైతన్య

యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన ఉట్నూర్‌కు చెందిన గిరిజన యువకుడు సాయి చైతన్య జాదవ్ శనివారం కలెక్టర్ రాజర్షి షాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సాయి చైతన్యకు కలెక్టర్ జ్ఞాపిక అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. జిల్లా నుంచి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.