News March 29, 2024

సరిహద్దు ప్రాంతాలలో నిరంతర నిఘాను ఏర్పాటు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ, పల్నాడు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరుగకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News September 8, 2025

CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

image

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 8, 2025

GNT: వృద్ధురాలిపై అత్యాచారం

image

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.

News September 8, 2025

గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల బ్లాకు

image

గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.