News March 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 24, 2026

సెక్స్ సీడీ కేసులో మాజీ సీఎంకు ఎదురుదెబ్బ

image

2017 ఛత్తీస్‌గఢ్ అశ్లీల సీడీ కేసులో మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ స్పెషల్ కోర్టు రద్దు చేసింది. మాజీ మంత్రి రాజేశ్ మున్నత్‌ను అప్రతిష్ఠపాలు చేయడానికి అశ్లీల వీడియోలు తయారు చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అదే సమయంలో ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.

News January 24, 2026

స్కాట్లాండ్ ఎంట్రీ.. కొత్త షెడ్యూల్ ఇదే

image

ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న T20WCలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడనున్నట్లు ICC ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సవరించింది. గ్రూప్-Cలో స్కాట్లాండ్ ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ENG, 17న నేపాల్‌తో తలపడనుంది. మరోవైపు PM ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న పాకిస్థాన్(PCB) స్థానంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ ఆ జట్టు తప్పుకుంటే పపువా న్యూ గినియా(PNG) ఆడే అవకాశం ఉంది.

News January 24, 2026

వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎలా ఉండాలంటే?

image

బాత్రూం విషయంలో అశ్రద్ధ తగదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పగిలిన అద్దాలు, వాడని వస్తువులు, విడిచిన బట్టలు ఉంచొద్దని అంటున్నారు. ‘దీనివల్ల ప్రతికూల శక్తి పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. బాత్రూం విశాలంగా ఉండాలి. బకెట్లను నీళ్లతో నింపి ఉంచడం మంచిది. వాటర్ లీకేజీ వల్ల సమస్యలొస్తాయి. శరీరాన్ని శుద్ధి చేసే ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>