News March 29, 2024
ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: అనంత ఎస్పీ

ఎన్నికల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
Similar News
News January 14, 2026
JNTU ACEA క్యాంపస్ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్ నెలలో నిర్వహించిన M.Tech 2-1 (R21), MCA 1-1, 2-1 (R20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వసుంధరతో కలిసి విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో HODలు రామశేఖర్ రెడ్డి, అజిత, కళ్యాణి రాధా, భారతి, జరీనా, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.
News January 13, 2026
అరటి ఎగుమతిపై ప్రత్యేక చర్యలు

జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధి, అరటి ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ తెలిపారు. అమరావతి నుంచి జరిగిన జూమ్ కాన్ఫరెన్స్‌లో రైలు మార్గం ద్వారా అరటి ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు. రవాణా ఖర్చులు తగ్గించడం, లాజిస్టిక్స్ మద్దతు పెంపు, రైతులకు లబ్ధి చేకూర్చే అంశాలపై చర్చ జరిగింది. రైళ్లను నిరంతరం నడిపి అరటి ఎగుమతులు సకాలంలో జరగాలన్నారు.
News January 13, 2026
అనంతపురం ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెండ్

అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దాడి ఘటనలో ఎస్పీ జగదీశ్ చర్యలు తీసుకున్నారు. ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు దాడికి సంబంధించిన వీడియోలను అందజేశారు. ఈ ఘటనలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గన్‌మెన్ షేక్షావలి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.


