News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 12, 2026
“ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, పూర్వ వరంగల్ డీపీఆర్ఓ కన్నెగంటి వెంకటరమణ రచించిన “సమ్మక్క.. ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మేడారంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడారం ప్రాశస్త్యం, వనదేవతల గొప్పతనం, ఆదివాసీల సంప్రదాయం, గడిచిన ఇన్నేళ్లలో మేడారంలో జరిగిన మార్పులు- అభివృద్ధి వంటి సకల సమాచారంతో పుస్తకాన్ని రూపొందించడం పట్ల మంత్రి అభినందించారు.
News January 12, 2026
పాపం శ్రీలీల.. బాలీవుడ్‌పైనే ఆశలు

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల చెప్పుకోదగ్గ హిట్లు లేక సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో ఆఫర్లు రావడం గగనమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న బాలీవుడ్ మూవీపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకున్నారు.
News January 12, 2026
జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.


