News March 29, 2024

ఆర్కిడ్ సొసైటీ అధ్యక్షుడిగా జానకిరామ్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ టి.జానకిరామ్ ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయనను నియమించారు. రెండేళ్లపాటు ఈ పదవిలో జానకిరామ్ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, రీసెర్చ్ డైరెక్టర్ నారం నాయుడు అభినందించారు.

Similar News

News March 20, 2026

గృహ గణనలో నిష్పాక్షికత: డీఆర్ఓ

image

భీమవరం కలెక్టరేట్‌లో గృహ గణనపై శుక్రవారం తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో డీఆర్ఓ శివన్నారాయణ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ.. గృహ గణన కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని తెలిపారు. గృహ గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 19, 2026

ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.

News March 19, 2026

భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

image

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.