News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 18, 2026
నాటి చారిత్రక సంపదకు నిలయం ‘సిద్దిపేట’

సిద్దిపేట జిల్లా కాకతీయులు, నిజాంల కాలం నాటి చారిత్రక సంపదకు నిలయం. ముఖ్యంగా నంగనూరులోని త్రికూటాలయం కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. పురాతన సిద్దిపేట ఖిల్లా, దాని బురుజులు నాటి రక్షణ వ్యవస్థను చాటుతాయి. వీటితో పాటు కొమురవెల్లి, బెజ్జంకి, కోహెడలోని ప్రాచీన ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కట్టడాలు నేటికీ జిల్లా సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.
News April 18, 2026
రాష్ట్ర స్థాయిలో రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

HYDలో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ -17 బాలుర రెజ్లింగ్ పోటీల్లో చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థులు బి.రిశ్వంత్, సీహెచ్.రవిచంద్ర రజత పతకాలు సాధించారు. కె.సమ్యక్, సీహెచ్ సాత్విక్, బీ.రిషి కౌశిక్ కాంశ్య పతకాలు గెలుచుకున్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన ఈ కేడేట్లను పాఠశాల డైరెక్టర్ కర్ణల్ రాజాదత్త, ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్ రెడ్డి, కోచ్ వంశీ కృష్ణ అభినందించారు.
News April 18, 2026
WGL: ఎమ్మెల్యేలకు వీడిన టెన్షన్!

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రస్తుత MLAలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో 6-7 నియోజకవర్గాలు కొత్తగా వస్తాయని, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయని ప్రచారం జరిగింది. కొందరు నాయకులు ఈ MLA మనకు ఉండరనే ఉద్దేశంతో మరో నేత దగ్గరకు వెళ్లిన వారున్నారు.కాగా ప్రస్తుత రిజర్వేషన్లే మళ్లీ ఉండటంతో తిరిగి MLAల దగ్గరకే రావాల్సిన పరిస్థితి లీడర్లకు ఏర్పడింది.


